ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా రెండో శతకంతో అదరగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 22వ సెంచరీ సాధించిన వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు కొట్టాడు.
నెదర్లాండ్స్‌పై శతకంతో మరో రెండు అరుదైన ఘనతలు కూడా వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు సమం చేయడంతో పాటు ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్‌ను అధిగమించాడు. వరల్డ్‌కప్ హిస్టరీలో వరుస శతకాలు బాదిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గానూ చరిత్ర లిఖించాడు.
తక్కువ ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో 22 సెంచరీలు చేసిన క్రికెటర్లు
►126 - హషీమ్ ఆమ్లా
►143 - విరాట్ కోహ్లి
►153 - డేవిడ్ వార్నర్*
►186 - ఏబీ డివిలియర్స్
►188 - రోహిత్ శర్మ
వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్లు
►7 - రోహిత్ శర్మ
►6 - సచిన్ టెండూల్కర్
►6 - డేవిడ్ వార్నర్*
►5 - రికీ పాంటింగ్
►5 - కుమార సంగక్కర