New Delhi, JAN 05: కొత్త సంవత్సరం వేడుకలు ముగియడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే మహీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ పేరుతో తనను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో (Ranchi Court) కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కా స్కోర్ట్స్ (Aarka Sports) యజమాని మిహిర్ దివాకర్(Mihir Diwakar), సౌమ్యా విశ్వాస్(Soumya Vishwas)లపై క్రిమిన్ కేసు నమోదు చేశారు. మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడమీ పెడతామని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాంచైజ్ ఫీ, లాభాల్లో వాటా ఇస్తామని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ, నిబంధనలను తుంగలో తొక్కుతూ మహీ భాయ్‌ను మోసం చేశారు. దాంతో, ఈ స్టార్ క్రికెటర్ అర్కా స్పోర్ట్స్‌కు పలుమార్లు లీగల్ నోటీసులు పంపించాడు. అయినా సరే మిహిర్, సౌమ్యాలు స్పందించలేదు. ఇప్పటివరకూ ఫ్రాంచైజ్ ఫీ, లాభాల్లో వాటా రూపంలో ధోనీకి రూ. 15 కోట్లు ముట్టాలి. దాంతో, చివరి అస్త్రంగా అతడు కోర్టుకు వెళ్లాడు.
భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ సారథిగా అదరగొడుతున్నాడు. కుర్రాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను 16వ సీజన్‌లో చాంపియన్‌గా నిలిపాడు. తన మార్క్ కెప్టెన్సీతో సీఎస్కేకు ఐదోసారి ట్రోఫీని అందించాడు. 17వ సీజన్‌లోనూ మహీ బరిలోకి దిగనున్నాడు. అయితే.. మోకాలి సర్జరీ నుంచి ఈమధ్యే కోలుకున్న ధోనీ 2024 ఎడిషన్‌లో టోర్నీ మొత్తం ఆడతాడా? కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.