Chennai, April 24: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి (MS Dhoni) క్రికెట్ పై ఉన్న పరిజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది డీఆర్ఎస్‌ను (DRS) తీసుకోవడంలో తడబాటుకు గురైనప్పటికీ కూడా దీన్ని చక్కగా వినియోగించుకుని ఫలితాలు రాబట్టడంలో ధోని ముందు వరుసలో ఉంటాడు. ధోని డీఆర్ఎస్ (Dhoni Review System) తీసుకున్నాడంటే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం చాలా అరుదగా మాత్రమే కనిపిస్తుంటుంది. అందుకనే అభిమానులు డీఆర్ఎస్‌ను ధోని రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తుంటారు. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌లోనూ ధోని రివ్యూ సిస్టమ్ ను అభిమానులు మరోసారి చూశారు.
Dhoni review system
CSK vs LSG
Big dhoni pic.twitter.com/BaQFlImET0
— vishavjeet yadav (@vishavj51964088) April 23, 2024
లక్నో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఇది జరిగింది. తుషార్ దేశ్ పాండే ఈ ఓవర్‌ను వేశాడు. క్రీజులో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతిని అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే.. ధోని దీన్ని సవాల్ చేయగా అంపైర్ వైడ్‌ను ఉపసంహరించుకున్నాడు.
When he reviews, just change your decision at that time. The reason why DRS= Dhoni Review System pic.twitter.com/BTNRObdPuj
— Div🦁 (@div_yumm) April 23, 2024
దీంతో సోషల్ మీడియాలో ధోని రివ్యూ సిస్టమ్ మీమ్స్‌తో హోరెత్తుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ధోని చెన్నై ఇన్నింగ్స్ లో ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చాడు. ఆడిన ఒక్క బంతినే బౌండరీగా తరలించాడు. దీంతో చెపాక్ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగిపోయింది.