2019 ICC Cricket world cup final match moments | Picture Credits: ICC

తొలిసారిగా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ టై, టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ చేసిన స్కోర్ 241.

రెండో ఇన్నింగ్స్ లో ఛేజింగ్ చేస్తూ ఇంగ్లండ్ చేసిన స్కోర్ 241.

దీనితో ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్.

సూపర్ ఓవర్ లో ఇంగ్లండ్ చేసిన స్కోర్ 15

సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్ చేసిన స్కోర్ కూడా 15.

దీంతో సూపర్ ఓవర్ కూడా టై కానీ, మ్యాచ్ లో ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టుగా విజేతగా నిలిచిన ఇంగ్లండ్.

ఇంకేం మొట్టమొదటి సారిగా విశ్వవిజేతగా అవతరించిన ఇంగ్లండ్.

అంతకుముందు ఒక్క 'ఓవర్ త్రో' ప్రపంచ కప్ ను దూరం చేసుకున్న న్యూజిలాండ్.

ఇంగ్లడ్ క్రికెట్ కు పుట్టినిల్లు. అయినా ఆ దేశానికి ప్రపంచకప్ రావటానికి 44 ఏళ్లు పట్టింది. తొలిసారి 1975లో లండన్ వేదిక జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచి వెస్టిండీస్ తొలి ప్రపంచకప్ విజేతగా నిలిచింది, ఆ తర్వాత 44 ఏళ్ల తర్వాత 2019లో మళ్ళీ అదే లండన్ గ్రౌండ్ లో ఎన్నో మలుపులతో ఎంతో ఉత్కంఠభరితంగా, అత్యంత నాటకీయంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో 'సూపర్' విక్టరీ కొట్టి 2019 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచి తొలిసారి ఛాంపియన్ జట్టుల సరసన నిలిచింది ఇంగ్లండ్.

2019 సీజన్ లో అనూహ్యంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్ లో ప్రవేశించాయి. ఈ రెండు జట్లు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. కాబట్టి ఈ రెండు జట్లలో ఏది గెలిచినా అది చరిత్ర సృష్టించడమే.

లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లకు 241/8 స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఛేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అప్పటివరకు కూడా మ్యాచ్ చూసేవారికి ఇది ఒక ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లా కాకుండా ఏదో సాధారణ మ్యాచ్ లో చప్పగా అనిపించింది. స్టేడియంలో ఒక హంగామా లేదు, కామెంటరీలో ఉత్సాహం లేదు. అయితే మ్యాచ్ చివరికంటూ వచ్చేసరికి ఇంగ్లండ్ టపటపా వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా ఉత్కంటత నెలకొంది. ఇంగ్లండ్ 49 ఓవర్ వచ్చేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లండ్ గెలవాలంటే మిగిలిన ఒకేఒక్క వికెట్ తో 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్ స్ట్రైకింగ్ లో ఉండటం ఇంగ్లండ్ కు కొంత భరోసా.

ఇంతటి కీలక సమయంలో న్యూజిలాండ్ దురదృష్టం కొద్దీ, ఇంగ్లండ్ అదృష్టం కొద్దీ 6 పరుగులు ఓవర్ త్రో కారణంగా రావడం ఇంగ్లండ్ కు బాగా కలిసొచ్చింది. అదే న్యూజిలాండ్ పాలిట శాపం అయింది. ఇక్కడ ఫీల్డర్ తప్పు లేదు, ఇంగ్లండ్ తప్పు కూడా లేదు.

ఆ చివరి ఓవర్లో ఒక సిక్స్ మినహా బౌలింగ్ కట్టుదిట్టంగానే సాగింది. అయితే ఆ తర్వాతి బాల్ కు కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది, బ్యాట్స్ మెన్ అతికష్టం మీద రెండో పరుగు కోసం ప్రయత్నించగా ఫీల్డర్ నేరుగా కీపర్ వైపు త్రో విసిరాడు. అయితే ఆ త్రో అనుకోకుండా పరుగు తీస్తున్న బ్యాట్స్ మెన్ చేతికి తగిలి అనూహ్యంగా బౌండరీకి తరలింది. దీంతో అంపైర్స్ దానిని 2+4 = 6 రన్స్ గా ప్రకటించారు. ఇంకేముంది? ఈ పరుగులతోనే మ్యాచ్ టైకి దారితీసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లోనూ ఇంగ్లండ్ కు కలిసొచ్చి ఏకంగా ప్రపంచ కప్ కొట్టేసింది.

ఈ రకంగా అర్థం లేని ఐసీసీ నిబంధనలతో గెలిచిన ఇంగ్లండ్ ను విజేత అనాలా? లేక ఏ దశలోనూ పట్టు సడలకుండా, ధైర్యం కోల్పోకుండా  అంతే సత్తా చాటిన న్యూజిలాండ్ ను నైతిక విజేత అనాలా? ఇద్దరినీ సంయుక్త విజేతగా ప్రకటిస్తే బాగుండేదని ఈ మ్యాచ్ చూసిన సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

ఏది ఏమైనా 2019 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆసాంతం ఎవరో మ్యాజిక్ చేసినట్లుగా సాగింది. లేకపోతే ఈ సీజన్ లో సూపర్ ఫాంలో ఉన్న ఇండియా ఎవరూ ఊహించని రీతిలో ఓడిపోవటం ఏంటి? ఎలాంటి అంచనాలు లేని న్యూజిలాండ్ ఫైనల్ చేరటం, అటు ఆస్ట్రేలియా ఓడిపోయి ఇంగ్లండ్ ఫైనల్ చేరటం. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ కూడా ఎవరి ఊహించని మలుపులు తిరుగుతూ సొంతగడ్డపై ఇంగ్లండ్ విజేతగా నిలవడం అంతా ఒక మాయలాగే లేదు.? వచ్చే 2023 ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగేది ఇండియాలోనే చూడాలి, అప్పుడేం జరుగుతుందో.