Afghanistan

పాకిస్థాన్‌లకు షాకిచ్చిన పసికూన అఫ్ఘానిస్థాన్‌...మాజీ చాంపియన్‌ శ్రీలంకను కూడా 7 వికెట్లతో చిత్తు చేసింది. తాజాగా ప్రపంచకప్ సెమీస్ రేసులో పోటీలోకి వచ్చేసింది.మెగా టోర్నీలో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఆప్ఘనిస్తాన్ మట్టికరిపించగా.. తరువాత మ్యాచ్ లో పాకిస్థాన్‌పైనా, శ్రీలంకపైనా గెలిచి పసికూన కాదని నిరూపించుకుంది. ఈ విజయాలతో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఆప్ఘనిస్తాన్ ఇప్పుడు సెమీస్ రేసులో నిలిచింది.

ఈ టోర్నీలో అఫ్గాన్‌ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను అఫ్గాన్లు ఎదుర్కోనున్నారు. ఈ మూడు మ్యాచ్‌లలో అనూహ్య ఫలితాలు వచ్చి అఫ్గాన్‌ గెలిస్తే మిగిత సమీకరణాలతో సంబంధం లేకుండా అఫ్గాన్‌ సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఆసీస్‌తో పాటు న్యూజిలాండ్‌కూ ఇంటి దారి పట్టక తప్పవు. మూడు మ్యాచ్‌లలో గెలిస్తే అఫ్గాన్‌ పాయింట్లు 12కు చేరతాయి. ఆసీస్‌ (8 పాయింట్లు), కివీస్‌ (8 పాయింట్లు)లు తాము ఆడబోయే తర్వాతి మూడుమ్యాచ్‌లలో రెండింటిలో ఓడితే అఫ్గాన్‌ నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.

పఠాన్ల సంచలనం, శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌లో దుమారం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్

ఒకవేళ అఫ్గాన్‌ రాబోయే మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి ఒకటి ఓడినా ఆసీస్‌, కివీస్‌ రెండు ఓడిపోయినా సెమీస్‌ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కివీస్‌ జట్టు తమ తర్వాత మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ చేతిలో ఆడాల్సి ఉంది. ఒకవేళ అఫ్గాన్‌ గనక మూడింటిలో రెండు ఓడినా మిగిలిన జట్ల ఫలితాలు దానికి అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ఇక ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాలలో ఒక జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడిపోవాలి.