ICC Men’s ODI Team 2021: ఒక్క భారత క్రికెటర్ కూడా లేడు, మెన్స్ వన్డే టీమ్ 2021 ను ప్రకటించిన ఐసీసీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కెప్టెన్ గా సెలక్ట్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి
Babar Azam (Photo credit: Twitter)

2021కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 11 మంది సభ్యులతో మెన్స్ వన్డే టీమ్ ను (ICC Men’s ODI Team) ప్రకటించింది. అయితే ఐసీసీ వన్డే టీమ్ లో ఒక్క టీమిండియా ఆటగాడికీ చోటు దక్కలేదు. రోహిత్ శర్్మ, కెఎల్ రాహుల్, కోహ్లీ, అశ్విన్ ఇలా ఎవ్వరూ (no Indian player included Team) ఇందులో చోటు దక్కించుకోలేదు. మెన్స్ వన్డే టీమ్ జట్టుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కెప్టెన్ గా ఎంచుకుంది. గత ఏడాది మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ల పేర్లతో ఈ టీమ్ ను (ICC announces ICC Men’s ODI Team) ప్రకటించినట్టు ఐసీసీ (ICC) వెల్లడించింది.

బాబర్ సహచరుడైన ఫకర్ జమాన్‌కూడా చోటు లభించింది. ఇద్దరు సఫారీ ఆటగాళ్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఇద్దరు ఐర్లాండ్ ఆటగాళ్లకు ఐసీసీ వన్డే జట్టులో చోటు లభించింది. జట్టులో పాల్ స్టిర్లింగ్, జానిమన్ మలాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, రాసీ వాండర్ డూసెన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫిఖర్ రహీమ్, వహిందు హసరంగ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సిమి సింగ్, దుష్మంత చమీరాలకు చోటిచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఐర్లాండ్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం.

తొలి వన్డేలో భారత్ ఓటమి, 31 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా, మూడు వన్డేల సిరీస్‌లో1-0 ఆధిక్యంలో నిలిచిన సఫారీలు

2021లో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బాబర్ 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో జట్టులో కీలక పాత్ర పోషించాడు. సీమర్లకు అనుకూలించే బర్మింగ్‌హామ్ పిచ్‌పై మర్చిపోలేని సెంచరీ నమోదు చేశాడు. ఫకర్ జమాన్ కూడా గతేడాది అద్భుతంగా రాణించాడు. ఆరు మ్యాచుల్లో 60.83 సగటుతో 365 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇందులో ఒకటి సౌతాఫ్రికాపై సాధించాడు. బ్యాట్, బంతితో రాణించిన శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ 14 మ్యాచుల్లో 27.38 సగటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 4.56 ఎకానమీతో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.

2021 ఐసీసీ వన్డే జట్టు:

పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), జామనెమన్ మలాన్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజం (పాకిస్థాన్), ఫకర్ జమాన్ (పాకిస్థాన్), రాసీ వాండెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), షకీబల్ హసన్ (బంగ్లాదేశ్), ముస్తాఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్), వనిందు హసరంగ (శ్రీలంక), ముస్తాఫిజుర్ రహ్మాన్(బంగ్లాదేశ్), సిమి సింగ్ (ఐర్లాండ్), దుష్మంత చమీర (శ్రీలంక)

ICC ODI Team of The Year: Paul Stirling, Janneman Malan, Babar Azam (C), Fakhar Zaman, Rassie Van Der Dussen, Shakib-al-Hasan, Mushfiqur Rahim, Wanindu Hasaranga, Mustafizur Rahim, Simi Singh, Dushmantha Chameera