Virat Kohli, Ben Stokes and Rohit Sharma (Photo Credits : Getty Images)

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గత క్యాలెండర్  ఏడాదిలో వివిధ దేశాల క్రికెటర్లు కనబరిచిన ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి వారికి అవార్డ్స్ (ICC Awards 2019) ప్రకటించింది.  ఐసీసీ ప్రకటించిన క్రికెట్ అవార్డ్స్- 2019 (Winners)  జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) లతో పాటు బెన్ స్టోక్స్ మరియు మార్నస్ లాబుస్చాగ్నేలు లాంటి పాపులర్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

2019 ప్రపంచ కప్‌లో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా కొంతకాలం పాటు నిషేధాన్ని ఎదుర్కొని తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ప్రేక్షకులు అతడ్ని చీటర్ అంటూ బూతులు తిడతారు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్దకు వెళ్లి ఆస్ట్రేలియన్ ప్రేక్షకులను బెదిరిస్తూ 'ఇంత గొప్ప ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా? అతణ్ని ప్రోత్సహించండి, ఛీర్ చేయండి' అంటూ వారికి సూచిస్తాడు.

కింగ్ కోహ్లీ కనబరిచిన ఈ స్పూర్థికి ఐసీసీ కూడా ఫిదా అయింది. 2019కి గానూ క్రీడాస్పూర్థి కలిగిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి అవార్డుతో సత్కరించింది. అదే ప్రపంచ కప్‌లో 5 సెంచరీలతో పాటు, ఏడాది కాలంగా సూపర్ హిట్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే '2019 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' గా ప్రకటించింది.

ఇక 2019- ప్రపంచ కప్‌ గెలుచుకున్న కెప్టెన్ గానూ, అలాగే ఆ ఏడాదికి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 'సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ' ని గెలుచుకున్నాడు.

2019 ఐసిసి అవార్డుల విజేతల పూర్తి జాబితా 

Umpire of the Year:  రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్)

 

T20I Performance of the Year:  దీపక్ చాహర్  (ఇండియా) మెరుగైన ప్రదర్శన బంగ్లాదేశ్ జట్టుపై  - 6/7

 

ICC Men's Emerging Cricketer: మార్నస్ లాబుస్చాగ్నే (ఆస్ట్రేలియా)

 

Associate Cricketer of the Year:  కైల్ కోట్జెర్ (స్కాట్లాండ్)

Spirit of Cricket Award: విరాట్ కోహ్లీ (ఇండియా)

ODI Cricketer of the Year: రోహిత్ శర్మ (ఇండియా)

 

Test Cricketer of the Year

Sir Garfield Sobers Trophy

Test Team of the Year

ఆటగాళ్ల వ్యక్తిగత అవార్డులతో పాటు సంవత్సరపు టెస్ట్ జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది. 11 మంది సభ్యులు గల జట్టులో 5గురు ఆస్ట్రేలియన్లు, ముగ్గురు కివీస్, ఇద్దరు భారత ఆటగాళ్లు మరియు ఒక ఇంగ్లాండ్ ఆటగాడికి ఆ జట్టులో స్థానం కలిపించింది. అదే విధంగా వన్డే జట్టును కూడా ప్రకటించింది. ఆ రెండు జట్లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పేరును నిర్ణయించింది.