Dubai, July 14: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని (ICC Confirms New Point System) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్రకారమే టీమ్స్‌కు ర్యాంకులు ఇవ్వనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. ప్రతి మ్యాచ్‌కు 12 పాయింట్లు అందుబాటులో ఉంటాయి. గెలిచిన టీమ్‌కు ఈ మొత్తం పాయింట్లు వస్తాయి.
పర్సెంటేజ్ పాయింట్ల రూపంలో చెప్పాలంటే 100 పాయింట్లు. అదే మ్యాచ్ టై అయితే ఒక్కో టీమ్‌కు 50 పర్సెంటేజ్ పాయింట్లు (ఆరు పాయింట్లు), మ్యాచ్ డ్రా అయితే 4 పాయింట్లు (33.33 పర్సెంటేజ్ పాయింట్స్) వస్తాయి. మ్యాచ్‌ల (World Test Championship 2021-23) సంఖ్యను బట్టి సిరీస్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి. తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫాలో అయిన పాయింట్ల పద్ధతిని ఐసీసీ ఇప్పుడు సులభతరం చేసింది. తాము అందుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. సిరీస్ లెంత్‌తో సంబంధం లేకుండా గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు, టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది.
ఓ టీమ్ డబ్ల్యూటీసీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్లను కౌంట్ చేసేలా ఈ కొత్త పద్ధతిని క్రికెట్ కమిటీ తీసుకొచ్చినట్లు ఐసీసీ తెలిపింది. కరోనా కారణంగా తొలి డబ్ల్యూటీసీలో కొన్ని సిరీస్‌లు కాకపోవడంతో అందుబాటులో ఉన్న పాయింట్ల పర్సెంటేజ్ ఆధారంగా టీమ్స్‌కు ర్యాంకులు కేటాయించారు. డబ్ల్యూటీసీలో భాగంగా మార్చి 31, 2023లోపు 9 జట్లు ఆరేసి సిరీస్‌లు (ఇంట మూడు, బయట మూడు) ఆడతాయి.
Here's ICC Tweets
More about the #WTC23 points system 👇https://t.co/Vh54VftU10
— ICC (@ICC) July 14, 2021
Some cracking fixtures to look out for in the next edition of the ICC World Test Championship 🔥
The #WTC23 schedule 👇 pic.twitter.com/YXzu5lS0t1
— ICC (@ICC) July 14, 2021
మొట్టమొదటి డబ్ల్యూటీసీ ట్రోఫీని (World Test Championship) కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
సిరీస్‌లోని మ్యాచ్‌ల ఆధారంగా కేటాయించే పాయింట్లు
2 మ్యాచ్‌ల సిరీస్- 24 పాయింట్లు
3 మ్యాచ్‌ల సిరీస్- 36 పాయింట్లు
4 మ్యాచ్‌ల సిరీస్- 48 పాయింట్లు
5 మ్యాచ్‌ల సిరీస్- 60 పాయింట్లు