Why India were given 3 byes after Virat Kohli was bowled off free hit vs Pakistan (Photo-Twitter)

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా (T20 World Cup 2022) దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి చెందిన సంగతి విదితమే. అయితే ఈ భారత్ పరాజయం (South Africa beat India on Sunday) పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఆ జట్టు ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నా..ఎక్కడో మిణుకు మిణుకుమంటూ (Pakistan still reach T20 World Cup semifinals ) సాంకేతికంగా మాత్రం ఓ ఛాన్స్ దోబూచులాడుతోంది. దాయాది దేశం సెమీస్ అవకాశాలను ఓ సారి పరిశీలిస్తే.. పాక్‌ మిగిలిన రెండూ గెలిచినా గరిష్టంగా 6 పాయింట్లు సాధించగలదు. ఇక దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌పై గెలిస్తే 7 పాయింట్లతో ముందంజ వేస్తుంది.

మరోవైపు భారత్‌కు బంగ్లాదేశ్, జింబాబ్వేలపై గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. అలాగే భారత్‌ ఒక మ్యాచ్‌ గెలిచి ఒకటి ఓడితే 6 పాయింట్లతో పాక్‌తో రన్‌రేట్‌లో పోటీ పడుతుంది. అయితే పాక్‌కంటే భారత్‌ రన్‌రేట్‌ ప్రస్తుతానికి ఎంతో మెరుగ్గా ఉండటంతో పాటు రోహిత్‌ సేన రెండూ గెలిచే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయం పక్కన బెడితే.. గురువారం దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్తాన్ ఓడితే దాని కథ ముగుస్తుంది.

ఇప్పటివరకు పాయింట్లను చూస్తే..

సౌతాఫ్రికా 3 మ్యాచ్ లు ఆడి 5 పాయింట్లను సాధించింది. పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఇంకా ఆడాల్సి ఉంది. ప్రస్తుత నెట్‌ రన్‌రేటు: 2.772. ఇండియా విషయానికి వస్తే 3 మ్యాచ్ లు ఆడి 4 పాయింట్లను సాధించింది. బంగ్లాదేశ్‌, జింబాబ్వే ఇంకా ఆడాల్సి ఉంది. నెట్‌రన్‌ రేటు: 0.844. భారత్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ఒకవేళ బంగ్లాదేశ్‌ను ఓడించి.. అనూహ్య పరిస్థితుల్లో జింబాబ్వే చేతిలో ఓడితే మాత్రం.. అప్పుడు సౌతాఫ్రికా, జింబాబ్వే ఏడు పాయింట్లతో ముందంజలో నిలుస్తాయి.

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన రోహిత్ సేన, వరల్డ్ కప్ లో తొలి ఓటమి

అదే సమయంలో పాకిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధిస్తే నెట్‌ రన్‌ రేటు పరంగా పోటీపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బంగ్లా, జింబాబ్వేపై రోహిత్‌ సేన తప్పకుండా గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది.

బంగ్లాదేశ్‌... ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడగా పాయింట్లు సాధించింది. దాని నెట్‌ రన్‌రేటు: -1.533. ఇండియా, పాకిస్తాన్‌తో మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. మిగతా రెండు మ్యాచ్‌లో భారత్‌, పాక్‌తో పోటీ పడనున్న బంగ్లా.. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా సెమీస్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. రెండూ గెలిస్తే మొత్తంగా 8 పాయింట్లు సాధించి ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 విరాట్ కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డ్, చేసింది 12 పరుగులే అయినా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, టీ-20 వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు

జింబాబ్వే..ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడగా..మూడు పాయింట్లను సాధించింది. నెట్‌ రన్‌రేటు: -0.050, మిగిలిన మ్యాచ్‌లు: నెదర్లాండ్స్‌, ఇండియా. సెమీస్‌ రేసులో నిలవాలంటే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే.పాకిస్తాన్ విషయానికి వస్తే.. మూడు మ్యాచ్ లు ఆడగా రెండు పాయింట్లతో ఉంది. నెట్‌ రన్‌రేటు: 0.765. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్‌ ఆరు పాయింట్లు సాధిస్తుంది. భారత్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి ఓడితే ఆరు పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి రన్‌రేటు పరంగా పాక్‌ పోటీ పడే అవకాశం ఉంటుంది.