మౌంట్ ముంగనూయి, మార్చి 6: ప్రపంచ కప్ వన్డే మహిళల క్రికెట్ లో భారత జట్టు పాకిస్థాన్ పై (India Vs Pakistan)అఖండ విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో భారత్ విజయం సొంతం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా 2022, మార్చి 06వ తేదీ ఆదివారం పాక్‌తో మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పాక్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43 ఓవర్లలో 137 పరులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 107 రన్లతో భారత్ ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్ జట్టు ఛేజింగ్ లో స్కోర్ చేయలేక చేతులెత్తేసింది. 137 పరుగులకే ఆల్ అవుట్ అయింది. పాక్ ఓపెనర్ సిద్రా అమీన్ ఒక్కరే 30 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత్ బౌలర్లలో రాజేశ్వరి నాలుగు, ఝలన్ గోస్వామి, స్నేహ్ చెరి రెండు వికెట్లు తీశారు. మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై టీం ఇండియా గెలిచి మంచి ప్రారంభాన్ని ఇచ్చింది.