ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది.
టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై)
నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు)
నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు..
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)