ind-vs-ban-team-india-creates-new-record-after-innings-win (Photo-Twitter)

Kolkata, November 24: బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా (India) క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదిక(Eden Gardens, Kolkata)గా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు(Pink Ball Test)లో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది.

మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 89.4 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 347 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్‌ ఇచ్చి బంగ్లాపై భారీ ఆధిక్యాన్ని సాధించింది.

BCCI Tweet

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 195 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ సునాయాసంగా ఈ టెస్టులో విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ 2-0 తేడాతో మరో టెస్టు సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముష్పికర్ రహీం (96 బంతుల్లో 74 పరుగులు, 13 ఫోర్లు) కొంత వరకు పోరాడినా భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. ఈ క్రమంలో భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 9 వికెట్లు తీయగా, మరొక బౌలర్ ఉమేష్ యాదవ్ 8 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. ఇక భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లి (194 బంతుల్లో 136 పరుగులు, 18 ఫోర్లు) సెంచరీతో రాణించగా, చటేశ్వర్ పుజారా (105 బంతుల్లో 55 పరుగులు, 8 ఫోర్లు), అజింక్యా రహానే (69 బంతుల్లో 51 పరుగులు, 7 ఫోర్లు)లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.