యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ (Womens T20 World Cup 2024)లో టీమ్ఇండియా ఉమెన్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (IND vs PAK)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత వికెట్ కీపర్ రియా ఘోష్
ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు (Team India).. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (32; 35 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29* రిటైర్డ్ హర్ట్), జెమీమా రోడ్రిగ్స్ (23) రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా రెండు, సాదియా ఇక్బాల్, ఒమైమా తలో వికెట్ పడగొట్టారు. భారత్ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్ 9న) శ్రీలంకతో తలపడనుంది.