(Photo Credits: BCCI/Twitter)

జైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది. ఫస్ట్ లో అదరగొట్టిన టీమిండియా బ్యాటర్లు చివర్లో టెన్షన్ పెట్టించారు. 3 బంతుల్లో మూడు పరుగులు అవసరమైన సమయంలో పంత్ బౌండరీ బాదడంతో విజయాన్ని దక్కించుకుంది టీమిండియా. దీంతో మూడు టీ-20 మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది రోహిత్ సేన. టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ( 62 పరుగులు) , రోహిత్ శర్మ ( 48 పరుగులు) తో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇక, రెండో టీ-20 ఈ నెల 19న రాంచీలో జరగనుంది.165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు నిలకడైన ఆరంభం లభించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీమిండియాకు మంచి స్టార్ట్ అందించారు. ఓ వైపు రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ వికెట్లు కాపాడాడు.

అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. టీమిండియా ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (70; 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు), స్టార్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలు బాదారు. టీ20 ప్రపంచకప్ 2021లో మెరిసిన డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్ శర్మ సారథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో భారత్ సిరీస్‌ వేటను ప్రారంభించింది.