India won (Image Credits: BCCI Twitter)

Basseterre, August 3: భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. బాస్సెటెర్రే వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన మరో 6 బంతులు మిగిలి ఉండగానే విజయ పతాకను రెపరెపలాడించింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (76, 8*4, 4*6) చిచ్చర పిడుగులా విరుచుకుపడటంతో భారత్ పరుగుల వరదను పారించింది. అయితే, తర్వాత వచ్చిన ఆటగాళ్ళు పెవీలియన్ చేరడంతో జట్టు స్కోరు మందగించింది. ఈ సమయంలో వచ్చిన రిషబ్ పంత్ బ్యాటు (24 బంతుల్లో 33 పరుగులు నాటౌట్) ఝులిపించాడు. దీంతో భారత్ విజయ తీరాలకు చేరింది.

ఆసియా కప్ 2022 షెడ్యూల్ విడుదల, ఆగస్టు 28న భారత్- పాకిస్తాన్ మ్యాచ్, ఆసియా కప్ టీ 20 షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే..

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.