Bengaluru, June 19;  భారత్‌, సౌతాఫ్రికా (South Africa) మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఐదో టీ20 (T-20) మ్యాచ్‌ వర్షార్పణమైంది. వాన (Rain) కారణంగా మ్యాచ్‌ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమం అయింది. టాస్‌ (Toss)పడిన కాసేపటికే ప్రారంభమైన వర్షం మ్యాచ్‌ను ఆలస్యం చేసింది. దీంతో ఆటను 19 ఓవర్లకు కుదించారు. వర్షం తగ్గిన తర్వాత భారత ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగారు. 3.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మళ్లీ వర్షం (Rain) పలకరించింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆ తర్వాత ఆట నిర్వహించే పరిస్థితి లేకుండా పోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు.

బెంగళూరు (Bengaluru) మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడింది. దీంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మైదానాన్ని సిద్ధం చేశారు. అయితే, మ్యాచ్ మొదలైన కాసేపటికే మళ్లీ వర్షం పడడంతో ఆటగాళ్లు, అంపైర్లు మైదానాన్ని వీడారు. టీమిండియా 3.3 ఓవర్లలో 2 వికెట్లకు 28 పరుగులు చేసిన దశలో మొదలైన వర్షం చాలాసేపు కొనసాగింది.

India vs South Africa, 4th T-20: వరుసగా రెండో మ్యాచ్ గెలిచిన భారత్, సిరీస్‌ పై ఆశలు సజీవం, ముంబై టీ-20లో ఘన విజయం సాధించిన టీమిండియా, కీలకంగా మారనున్న లాస్ట్ మ్యాచ్ 

దాంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం జలమయమైంది. ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ జరిపే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్టున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్ లో చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి.