Mumbai, June 18: సౌతాఫ్రికాతో నాలుగో టీ 20 (T-20) మ్యాచ్ లో భారత్ (Team India) అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 16.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 87 పరుగులే చేసింది. ఫలితంగా 82 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (8) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (Avesh Khan) అదరగొట్టాడు. 18 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా (South Africa) పతనంలో కీ రోల్ ప్లే చేశాడు. డసెన్ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బవుమా (8) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయం సాధించింది. అవేశ్ ఖాన్ ఒకే ఓవర్‌లో డసెన్ (20), మార్కో జాన్‌సెన్ (12), మహరాజ్ (0)లను ఔట్ చేసి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
Clinical win for #TeamIndia in Rajkot! 👏 👏
The @RishabhPant17-led unit beat South Africa by 82 runs to level the series 2-2. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/fyNIlEOJWl
— BCCI (@BCCI) June 17, 2022
భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (Dinesh karthik) రాణించారు. పాండ్య 31 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కాగా.. దక్షిణాఫ్రికాపై పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే భారీ విజయం. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన ఐదో మ్యాచ్ బెంగళూరులో జరగనుంది.
తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలై డీలాపడిన యువ భారత్.. వైజాగ్‌లో జరిగిన మూడో టీ20లో అదరగొట్టి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటుతో, బంతితో అంచనాలకు తగ్గట్లు రాణించి సఫారీలకు పర్యటనలో తొలి ఓటమి రుచి చూపించిన కుర్రాళ్లు.. రాజ్‌కోట్‌గా వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లోనూ సత్తా చూపించారు. కాగా, ఈ సిరీస్‌లో పంత్ నాలుగోసారి కూడా టాస్ ఓడిపోయాడు.