Newdelhi, Dec 18: బంగ్లాదేశ్ (Bangladesh)తో తొలి టెస్టులో భారత్ (India) ఘన విజయం సాధించింది. 188 పరుగుల (Runs) తేడాతో బంగ్లాను ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు (Score) 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. జాకిర్ హసన్ (100), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (84), నజ్ముల్ హొస్సేన్ శాంటో (67) సత్తా చాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4/77), కుల్దీప్ యాదవ్ (3/73) రాణించారు. చివరి రోజు ఆట మొదలైన వెంటనే మెహిదీ హసన్(13)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.
ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్
ఆ తర్వాత ధాటిగా పోరాడుతున్న కెప్టెన్ షకీబల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఈనెల 22 నుంచి మీర్పూర్ లో జరగనుంది.
1ST Test. India Won by 188 Run(s) https://t.co/CVZ44NpS5m #BANvIND
— BCCI (@BCCI) December 18, 2022