
India vs New Zealand 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ( India vs New Zealand ) తన రెండో ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ( India vs New Zealand ) భారత్ కు 283 పరుగుల ఆధిక్యం లభించగా. న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రేయాస్ అయ్యర్ 65 పరుగులు చేయగా, వృద్ధిమాన్ సాహా 61 పరుగులు సాధించాడు. అశ్విన్ 32, అక్షర్ పటేల్ 28 పరుగులు చేశాడు. సౌథీ, జెమీసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అజాజ్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్ లో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్ లో 276 కంటే ఎక్కువ పరుగులు ఛేదించినట్లు రికార్డుల్లో లేదు. అందుకే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్, అశ్విన్ లకు కొత్తబంతిని అప్పగించాడు. తొలి ఇన్నింగ్స్ లో అక్షర్ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీయడం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లోనూ వీరిద్దరూ సత్తా చాటితే కివీస్ కు ఓటమి ఖాయం. ఇదిలా ఉంటే టెస్టు మ్యాచుకు ఆటకు రేపు ఆఖరిరోజు