India vs Sri Lanka, 2nd ODI: విజయోత్సాహంలో భారత్‌, వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు స్కెచ్‌, శ్రీలంకతో రెండో వన్డేకు భారత్ సిద్ధం, ఈడెన్ గార్డెన్స్‌ లో రోహిత్ రికార్డుల మోత
India vs Sri Lanka (PIC @ ICC Twitter)

Kolkata, JAN 12:  ఇండియా వర్సెస్ శ్రీలంక (India vs Sri Lanka) జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో (Eden Gardens) మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ భారీ విజయాన్ని సాధించి వన్డే సిరీస్‌ను తన ఖతాలో వేసుకొనేందుకు సిద్ధమైంది. తొలిమ్యాచ్ లో కీలక బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌ను ఉండటం భారత్ కు కలిసొచ్చే ప్రధాన అంశం. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. రోహిత్ (Rohit sharma) ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈ సారికూడా రోహిత్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. చివరిసారిగా 2020 జనవరిలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన రోహిత్.. చాలాకాలం తరువాత ఈడెన్‌లో సెంచరీ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

IND vs SL 1st ODI: తొలి వన్డేలో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా, కోహ్లీ శతక బాదుడుతో లంకకు తప్పని ఓటమి, 64 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు..  

తొలి వన్డే జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో ఆడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ (KL Rahul) స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను (Ishan Kishan) తీసుకోవాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న అంశం ఆసక్తికరంగా మారింది.

Rohit Sharma: రోహిత్ శర్మని చూసి ఏడ్చేసిన చిన్నారి, దగ్గరకు వెళ్లి బుగ్గ గిల్లి ఓదార్చిన రోహిత్, సోషల్ మీడియాలో వీడియో వైరల్  

టీమిండియాపై తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని చవిచూసిన శ్రీలంక.. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ శనక (Shanaka) బ్యాటింగ్ ఒక్కటే ఆ జట్టుకు ఊరట. సెంచరీతో తొలి వన్డేలో ఆకట్టుకున్న అతను ఫామ్ ను కొనసాగించాలని లంక కోరుకుంటోంది. తొలివన్డేలో ఫీల్డింగ్ లో లంక ఆటగాళ్లు విఫలమయ్యారు. కోహ్లీ క్యాచ్ ను రెండుసార్లు వదిలేయడంతో పాటు బౌండరీల వద్ద పలుసార్లు బాల్‌ను అడ్డుకోవటంలో విఫలమయ్యారు. రెండో వన్డేలోనూ ఇదే పరిస్థితి ఉంటే టీమిండియా సిరీస్ గెలుచుకోవటం ఖాయమే. ఈ డెన్ గార్డెన్స్ లో చివరిసారి వన్డే మ్యాచ్ జరిగి ఐదేళ్లు అవుతుంది. చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్ లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ కాగా ఆసిస్ 202 పరుగులే చేసింది.