Ahmedabad Feb 09: వెస్టిండిస్ తో జరిగిన రెండో వన్డేలో (India vs West Indies) టీమిండియా ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై భారత్ గెలిచింది. భారత్ (Team India) నిర్ధేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన విండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 11న జరుగనుంది. టీమిండియా విజయంలో ప్రసిద్ద్ కృష్ణ కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) 4 వికెట్లను తీశాడు. విండీస్ బ్యాట్స్ మెన్ లో షమా బ్రూక్స్(44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అకీల్ హోసెయిన్ (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు షాయ్ హోప్ (27) బ్రెండన్ కింగ్ పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన డారెన్ బ్రావో నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, ఫేబియన్ అలెన్, కీమర్ రోచ్ విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన ఓడిన్ స్మిత్ 24 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ( Prasidh Krishna) నాలుగు, శార్ధూల్ ఠాకూర్( Shardul) రెండు, యజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
India seal the series 💥
Prasidh Krishna finishes with a brilliant four-for as West Indies are all out for 193. #INDvWI | https://t.co/oBgosJPTDa pic.twitter.com/zJMIuDsMIe
— ICC (@ICC) February 9, 2022
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ఆరంభంలోనే ఓపెనరర్ రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 18 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 18 పరుగులు చేశాడు. అయితే కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి 48 బాల్స్ లో 49 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 83 బంతుల్లో 64 రన్స్ చేశాడు. దీంతో భారత్ 238 పరుగులు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో స్మిత్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా, కీమర్ రోచ్, ఫేబియన్ అలెన్, అకీల్ హోసెయిన్, జేసన్ తలో వికెట్ పడగొట్టారు.