New Delhi, Febuary 17: మండు వేసవిలో క్రికెట్ సమరం మొదలు కాబోతోంది. మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం 8 జట్లు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయి.
గతంలో శనివారం, ఆదివారం రెండేసి మ్యాచ్‌లు చొప్పున జరిగేవి. వాటిని కేవలం ఈ సారి ఆదివారానికే పరిమితం చేశారు. గత సంవత్సరం వరకూ 44 రోజుల్లో లీగ్ మ్యాచ్‌లను ముగిస్తుండగా ఈ సారి మరో ఆరు రోజులు పొడిగించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఏప్రిల్ 1న ఢీకొననుంది.
కాగా 2019లో జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ నాలుగోసారి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సారి టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే మే 24 వరకు ఆగాల్సిందే.
Here is IPL 2020 Full Schedule Tweet:
#IPL2020 schedule ❤😍 pic.twitter.com/bOsEvypclR
— VIVO IPL 2020 (@IPLCricket) February 15, 2020
టీమిండియా-సౌతాఫ్రికా మధ్య హోం సిరీస్ ముగిసిన 11 రోజుల తర్వాత ఐపీఎల్ టోర్నమెంట్ మొదలవ్వబోతోంది. నాకౌట్ మ్యాచుల ఫుల్ షెడ్యూల్ తర్వాత విడుదల చేయనున్నారు.
Here's SunRisers Hyderabad Schedule
🚨 ATTENTION #OrangeArmy🚨
The moment you've all been waiting for.
Mark your 🗓 for #IPL2020! pic.twitter.com/Z11JPXDvwu
— SunRisers Hyderabad (@SunRisers) February 15, 2020
సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘హోం' మ్యాచ్‌లను ఎప్పటిలాగే ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో హైదరాబాద్‌కు బయట ఆడనుంది.