Mumbai, May 30: ఐపీఎల్‌లో (IPL)కెప్టెన్‌గా అడుగు పెట్టడమే తనేంటో నిరూపించుకున్నాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). జట్టును ముందుండి నడిపిస్తూ అందరి కన్నా ముందే ప్లేఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్‌లో అద్భుతమైన ఆటతీరుతో.. ఫైనల్ చేర్చాడు. చివరి మ్యాచ్‌లో కూడా బంతితో, బ్యాటుతో రాణించి జట్టుకు తొలి సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ (IPL Title)అందించాడు. ఐపీఎల్ ఫైనల్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన గుజరాత్ జట్టు (Gujarat) సునాయాస విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ (Rajasthan) జట్టు.. బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో సాహా (5), మాథ్యూ వేడ్ (8) త్వరగానే అవుటయ్యారు. అలాంటి సమయంలో శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్)కు జతకలిసిన పాండ్యా (34) జట్టును విజయానికి చేరువ చేశాడు.

అయితే చాహల్ (Chahal) అతన్ని బోల్తా కొట్టించాడు. పాండ్యా అవుటైన తర్వాత వచ్చిన మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్) మరోసారి తను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. మిగతా బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు కష్టపడిన పిచ్‌పై తను మాత్రం ధారాళంగా పరుగులు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించాడు.

RR vs RCB Qualifier: ఈసారి కూడా బెంగళూరుకు నిరాశే, ఫైనల్‌కు చేరిన రాజస్థాన్, జోస్‌ బట్లర్ అజేయ సెంచరీతో రాజస్థాన్‌లో జోష్, ఆదివారం గుజరాత్‌తో ఢీకొట్టనున్న రాజస్థాన్ 

అతన్ని చూసిన ఊపులో గిల్ (Gill) కూడా రెచ్చిపోయాడు. 19వ ఓవర్ తొలి బంతికే సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. దీంతో గుజరాత్ జట్టు మరో 11 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.