Mumbai, March 03: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అన్ని జట్లు మార్చి 14వ తేదీ లేదా 15వ తేదీ నుంచి ప్రాక్టీస్ ప్రారంభిస్తాయి. దీని కోసం ఐదు ప్రాక్టీస్ సైట్‌లను (Practice sites) గుర్తించారు బీసీసీఐ అధికారులు. IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుండగా.. ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) బాంద్రా కుర్లా క్యాంపస్(Bandra Kurla Complex), థానే MCA స్టేడియం, Dr. DY పాటిల్ యూనివర్సిటీ గ్రౌండ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా గ్రౌండ్(Cricket Club of India), రిలయన్స్ కార్పొరేట్ పార్క్(Reliance Corporate Park ground) గ్రౌండ్‌ల పేర్లు ఉన్నాయి. మార్చి 8 నుంచి ఆటగాళ్లు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. ఐపీఎల్ సజావుగా సాగేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం(Maharastra Govt.), భారత క్రికెట్ బోర్డు (BCCI), ఎంసీఏతో సమావేశం నిర్వహించింది. ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొనబోతున్నాయి. ముంబై చేరుకోవడానికి 48 గంటల ముందు పాల్గొనే వారందరూ RT-PCR పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్ల బస కోసం ముంబైలో 10, పుణెలో రెండు హోటళ్లను గుర్తించగా.. ఆటగాళ్ళు తమ బయో-బబుల్‌లోకి ప్రవేశించే ముందు మూడు నుంచి ఐదు రోజుల పాటు నిర్బంధంలో ఉండవలసి ఉంటుంది. ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు ముంబై, పుణెలలో జరగనుండగా.. మార్చి 26న ప్రారంభమై మే 29న ఫైనల్‌తో ముగుస్తుంది.
ముంబైలో (Mumbai) 55 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లే ఆఫ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ 2022 లీగ్ దశలో ముంబైలో 55, పూణేలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు నాలుగు స్టేడియంలలోనే జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
మొత్తం పది జట్లతో కూడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబైలో మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. లీగ్ ఫైనల్ మే 29న జరగనుండగా.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం మార్చి 26వ తేదీ శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో చివరి మ్యాచ్ మే 29వ తేదీన జరుగుతుంది.