Deepak Chahar (Photo Credits: @BCCI/Twitter)

New Delhi, March 02: ఐపీఎల్ (IPL) ప్రారంభం కాకముందే...చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 15వ సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడనున్న దీపక్ చాహర్ (Deepak Chahar) ఆ టీంకు దూరమయ్యాడు. అద్భుతమైన ఫామ్‌ లో ఉన్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో పాల్గొనడం లేదు. వెస్టిండిస్‌ తో జరిగిన సిరీస్‌ లో గాయపడిన చాహర్...ఆరంభ మ్యాచ్‌ లకు దూరమవుతున్నారు. ఐపీఎల్ -2022 మెగా వేలంలో చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) రూ. 14 కోట్లకు దక్కించుకుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను చివరి మ్యాచ్ ల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చి26 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం మార్చి 14 లేదా 15 నుండి, అన్ని జట్లు తమ ప్రాక్టీస్ ప్రారంభిస్తాయి. ఈ ప్రాక్టీస్ కు కూడా చాహర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు.

IND vs SL 2nd T20I 2022: రెండో టీ20లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా

మార్చి 26న ప్రారంభమయ్యే ఐపీఎల్-2022 సీజన్ మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి 10 జట్లతో కూడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబైలో మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. లీగ్ ఫైనల్ మే 29న జరిగే అవకాశం ఉండగా.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం మార్చి 26వ తేదీ శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.

ICC Women's World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం, 9 మంది ఆటగాళ్లతో క్రికెట్ ఆడవచ్చు, మెగా టోర్నీ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పు

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పూర్తి జట్టు, ఆ యాజమాన్యం ఆటగాళ్లను కొనుగోలు చేసిన ధరలు ఇలా ఉన్నాయి.

రాబిన్ ఉతప్ప (రూ. 2 కోట్లు), డ్వేన్ బ్రావో (రూ. 4.40 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు), కెఎమ్ ఆసిఫ్ (20 లక్షలు), తుషార్ దేశ్ పాండే (20 లక్షలు), శివమ్ దూబే (4 కోట్లు), మహేశ్ దీక్షనా (70 లక్షలు), సిమర్జిత్ సింగ్ (20 లక్షలు), డెవాన్ కాన్వే (1 కోటి), డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), రాజ్వర్ధన్ హంగర్గేకర్ (1.50 కోట్లు), మిచెల్ సాంట్నర్ (1.90 కోట్లు), ఆడమ్ మిల్నే (1.90 కోట్లు), సుభ్రాంశు సేనాపతి (20 లక్షలు), ముఖేష్ చౌదరి (20 లక్షలు) మరియు ప్రశాంత్ సోలంకి (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), క్రిస్ జోర్డాన్ (3.60 కోట్లు), ఎన్ జగదీసన్ (20 లక్షలు) మరియు సి హరి నిశాంత్ (20 లక్షలు), రవీంద్ర జడేజా (16 కోట్లు), ఎంఎస్ ధోని (12 కోట్లు), మొయిన్ అలీ (8 కోట్లు) మరియు రీతురాజ్ గైక్వాడ్ (6 కోట్లు).