న్యూజీలాండ్ లో మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మెగా టోర్నీ సజావుగా సాగాలనే ఉద్దేశంతో నిబంధనలు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఏదైనా జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసీసీ అనుమతిచ్చింది. అలాగే ప్లేయర్స్‌ను బయో బబుల్స్‌లో ఉంచడం, బంతి బౌండరీ లైన్ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయడం, ఓ ప్లేయర్ కరోనా బారిన పడితే జట్టులో ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం వంటి నిబంధనలను యధాతథంగా కొనసాగుతాయని ఐసీసీ ప్రకటించింది.
ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా సహా పలు జట్లలో కరోనా కేసులు నమోదై, కనీసం 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేని పరిస్థితి ఏర్పడింది. ఓ జట్టైతే ఆటగాళ్లు అందుబాటులో లేక టోర్నీలో నుంచే వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలను సవరించింది.
Teams can play with nine players at #CWC22 https://t.co/jJtom77gIv via @ICC
— ICC Media (@ICCMediaComms) February 24, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)