టీ20 వరల్డ్‌కప్-2022 ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేదుకు ఐపీఎల్ (IPL) రెడీ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కాగా కొచ్చి వేదికగా డిసెంబర్ 23న ఐపీఎల్-2023 మినీ వేలం (IPL 2023 Auction) జరగనుంది. ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు అయినా చెల్లించేందుకు రెడీ అవుతున్నాయి.
మినీ వేలంలో కోట్లు పలికే ఆటగాళ్లను ఓ సారి పరిశీలిస్తే.. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే) బంగ్లాదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ వంటి ఆటగాళ్లు టాప్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు ప్రాంఛైజీలు వెచ్చించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్‌లు వేసుకున్నట్లు సమాచారం.
అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్‌లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది.ఒక్కో ఫ్రాంచైజీకి తమ చివరి వేలం పర్స్‌లో మిగిలిపోయిన డబ్బుతో పాటు వారు విడుదల చేసిన ఆటగాళ్ల విలువతో పాటు మొత్తం పర్స్ రూ. 95 కోట్లకు చేరడంతో అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తారు.