IPL 2024, Delhi Capitals vs Kolkata Knight Riders

కేకేఆర్ భారీ లక్ష్యం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ లొంగిపోయింది. 273 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఢిల్లీ జట్టు కేవలం 166 పరుగులకే పరిమితమైంది. IPL 2024లో, KKR వరుసగా మూడో మ్యాచ్‌లో 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వరుసగా మూడో మ్యాచులో విజయం సాధించింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్ కతా విజయం సాధించింది. మూడో మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం కోల్ కతా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేయలేకపోయింది.  టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. అయితే ఇదే టోర్నీలో  సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగుల రికార్డును కోల్ కతా జట్టు బద్దలు కొట్టలేకపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 273 పరుగులు చేయాల్సి వచ్చింది.

భారీ స్కోరు ఛేదించేందుకు వచ్చిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. టాప్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్ చౌకగా ఔట్ కావడంతో వెనుదిరిగారు. కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చి ఆదుకున్నాడు. వరుణ్ చక్రవర్తి వరుసగా 6 బంతుల్లో భారీ షాట్లు కొట్టి ఒకే ఓవర్‌లో 26 పరుగులు చేశాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు.