New Delhi, April 27: ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో దంచుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా 4 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. తద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virta Kohli) రికార్డును సమం చేశాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌పై అర్ధ శతకంతో చెలరేగిన రాహుల్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 4,o41 రన్స్ బాదగా.. రాహుల్ 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు.
All KLass in 𝟒𝐊 💙 pic.twitter.com/302XHlU5mR
— Lucknow Super Giants (@LucknowIPL) April 27, 2024
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా తన ముద్ర వేసిన రాహుల్.. నాలుగు వేలకు పైగా రన్స్ కొట్టిన మూడో ఇండియన్‌గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు శిఖర్ ధావన్(Shikhar Dhawan), విరాట్ కోహ్లీలు ఈ ఫీట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక రన్స్ బాదిన ఓపెనర్లలో ధావన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ సారథిగా ఉన్న ధావన్ 202 ఇన్నింగ్స్‌ల్లో 6,362 రన్స్ సాధించాడు. రెండో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 162 ఇన్నింగ్స్‌ల్లో 5,909 పరుగులు బాదాడు. పంజాబ్, బెంగళూరు జట్లకు ఆడిన క్రిస్ గేల్ 122 ఇన్నింగ్స్‌ల్లో 4,480 రన్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు.