Mohali, SEp 22: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు(Team India) అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో కంగారూలను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 277 ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(74 :63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్(71 : 77 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ రాహుల్(56 నాటౌట్), ఆసీస్‌పై వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్(50) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు వాకిట నిలిపారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విలువైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపియ్యాడు. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 277 పరుగుల చేధనలో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(74), రుతురాజ్ గైక్వాడ్(71) ధాటిగా ఆడారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 పరుగులు జోడించారు. అయితే.. ఆడం జంపా ఓవర్లో రుతురాజ్ ఎల్బీగా దొరికిపోయాడు.
A fine 50-run partnership comes up between @klrahul & @surya_14kumar 👏👏
Live - https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/ZPQMyqGTba
— BCCI (@BCCI) September 22, 2023
ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్(3) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఇండియా 9 పరుగలు వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ రాహుల్(1), ఇషాన్ కిషన్(18) ఆచితూచి ఆడారు. ఇషాన్ ఔటయ్యాక వచ్చిన సూర్య ఓపికగా ఆడాడు. రాహుల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 80 రన్స్ జోడించాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే 24వ తేదీన జరుగనుంది.
మొహాలీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబూషేన్(39) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి.