South Africa December 26: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో(South Africa vs India) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టాడు. తొలి రోజు మ్యాచ్‌లో సెంచరీ(KL Rahul Century ) సాధించాడు. మొత్తం 218 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఏడో సెంచరీ. 99 పరుగులు వద్ద మహారాజ్ బౌలింగులో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన జట్టుకు రాహుల్, మయాంక్ (Mayank) జోడీ శుభారంభాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. 60 పరుగులు చేసిన మయాంక్.. లుంగి ఎంగిడి() బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. రాహుల్‌తో కలిసి సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈక్రమంలో 35 పరుగుల వ్యక్తిగత వద్ద కోహ్లీ అవుటయ్యాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు లుంగి ఎంగిడి ఖాతాలోనే పడ్డాయి. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రాహుల్ 104, రహానే 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.