
Mumbai, April 26: లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కృనాల్ పాండ్య (Krunal Pandya) మరోసారి తండ్రి అయ్యాడు. ఈ నెల 21న అతడి భార్య పంఖురి శర్మ (Pankhuri) మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ పాండ్య సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఆ చిన్నారికి వాయు అని పేరు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. చిన్నారి వాయుతో కలిసి ఉన్న ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. కృనాల్ పాండ్య ప్రముఖ మోడల్ అయిన పంఖురిని 2017లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 జూలై 24న కవిర్ జన్మించాడు. ఇక కృనాల్ సోదరుడు హార్దిక్ పాండ్యకు సైతం ఓ కొడుకు ఉన్నాడు. హార్దిక్-నటాషా దంపతుల కొడుకు పేరు ఆగస్త్య (Agasthya).
Vayu Krunal Pandya
21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm
— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృనాల్ పాండ్య (Krunal Pandya) ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన కృనాల్ 58 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. ఇక లక్నో ఎనిమిది మ్యాచులు ఆడగా 5 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.