Sanjiv Goenka and KL Rahul (Photo Credits: Star Sports)

Hyderabad, May 09: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి భారీ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జట్టు లక్నో సూపర్ జైంట్స్‌పై (LSG) 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ (SRH Won) ఒక్క వికెట్ పడకుండా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఓపెనర్లలో అభిషేక్ శర్మ (75 నాటౌట్; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్), ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్)తో హాఫ్ సెంచరీలతో విజృంభించారు. లక్నో జిత్తులు, ఎత్తులు సన్‌రైజర్స్ ఓపెనర్లు చిత్తు చేశారు.. లక్నో బౌలర్లు బంతులతో ఎలాంటి మాయాజాలం చేసినా హైదరాబాద్ ఆటగాళ్ల ముందు ఏమాత్రం పనిచేయలేదు. కొంచెం కూడా ఇద్దరు తడబడకుండా క్రీజులో నిలబడి ఆడుతూ పాడుతూ ఊచకోత కోశారు.

 

కీల‌కమైన మ్యాచ్ లో ఓట‌మితో లక్నో (LSG) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓన‌ర్ సంజివ్ గోయెంకా (LSG Owner Sanjiv Goenka) కూడా బ‌హిరంగంగానే అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. 10 వికెట్ల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలవ్వ‌డంపై కెప్టెన్ కేఎల్ రాహుల్ తో స్టేడియంలోనే వాగ్వాదానికి దిగారు. మ్యాచ్ ముగిసే స‌మ‌యానికి అక్క‌డే ఉన్న కేఎల్ రాహుల్ పై గోయెంకా మండిప‌డుతున్న దృశ్యాలు లైవ్ లో ప్ర‌సార‌మ‌య్యాయి. దాంతో కామెంటేట‌ర్ కూడా ఇలాంటివి నాలుగు గోడల మ‌ధ్య చూసుకోవాల్సిన విషయాలంటూ చెప్ప‌డం స్ప‌ష్టంగా వినిపిస్తోంది. వాగ్వాదానికి సంబంధించిన వీడియా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.