WPL 2024 (PIC@ X)

Bangalore, FEB 24: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ శుక్రవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగింది. ఢిల్లీ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా (Sanjana) సిక్స్ కొట్టి విజయాన్ని అందించారు. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై జట్టు (Mumbai Win) నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్య చేధనతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ హెలీ మాథ్యూస్ డకౌట్ అయింది. అనంతరం యాస్తికా భాటియా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె 45 బంతుల్లో 57 పరుగులు చేసింది. నాట్ స్కివర్ బ్రంట్ (19) త్వరగానే అవుటైంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harman Preet Kaur) చెలరేగిపోయింది.

Akash Deep: ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన జాక్‌ క్రాలే, అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో నిరాశ, ఆ తర్వాత అదే కసితో మూడు వికెట్లు.. 

చివరి హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ వచ్చింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ఎస్. సజన ఉన్నారు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దాదాపు ఖాయమని అనుకుంటున్న సమయంలో చివరి బంతికి సజన సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ముంబై ఇండియన్స్ మహిళల జట్లు నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.