నేపాల్‌, ఒమన్ జట్లు చరిత్ర సృష్టించాయి. యూఎస్‌ఎ, వెస్టిండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2024కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్‌-2 లో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్‌.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. 135 పరుగుల లక్ష్యాన్ని నేపాల్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. ఇక ఒమన్ కూడా అర్హత సాధించింది.

2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌తో పాటుగా టీ20 వరల్డ్‌కప్‌ టాప్‌-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ నేరుగా అర్హత సాధించాయి.

అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా ఇప్పటికే ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా అర్హత సాధించగా.. తాజాగా ఈ జాబితాలో నేపాల్‌, ఒమన్ చేరాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)