Mumbai, FEB 10: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishab pant) తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో నడుస్తున్న ఫొటోల్ని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో (Rishab pant Instagram) షేర్ చేశాడు. ‘ఒక అడుగు ముందకు. ఒక అడుగు బలంగా. ఒక అడుగు మరింత మెరుగ్గా’ అంటూ ఆ ఫొటోలకు క్యాప్షన్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు (Pant accident) గురైన తర్వాత పంత్ సోషల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో (Kokilaben) జనవరి 26న ఈ స్టార్ ప్లేయర్‌కు మోకాలికి సర్జరీ అయింది. 2022 డిసెంబర్ 30న పంత్ డ్రైవ్ చేస్తున్న కారు రూర్కీ సమీపంలో యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. పంత్ ఊతకర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
అతను త్వరగా కోలుకొని మైదానంలో అడుగుపెట్టాలని చాలామంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వికెట్ కీపర్‌గా, విధ్వంసక బ్యాటర్‌గా రాణించిన పంత్ అనతి కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2022లో అతను 7 టెస్టుల్లో 680 రన్స్ చేశాడు. అలాంటి పంత్ యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది చాలా వరకు క్రికెట్‌కు దూరం కానున్నాడు. అతను కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది.
దాంతో అతడిని ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. పంత్ ప్లేస్‌లో తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ తుది జట్టులోకి వచ్చాడు. అంతేకాదు ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ పంత్ మెరుపులు చూడలేం. దాంతో, ఢిల్లీ క్యాపిటల్స్ అతని స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించనుంది.