New Delhi, April 21: పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ (Pbks Vs Gt) విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ ధీటైన బౌలింగ్‌తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్ (Gujarat) బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించారు. 143 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలానే ప్రయాస పడ్డారు. శుభ్‌మన్‌గిల్ (35), సాయి సుదర్శన్ (31) ఇద్దరూ ఫర్వాలేదనిపించారు. పంజాబ్ (Punjab Kings) బౌలింగ్‌లో మిగిలిన బ్యాటర్లు అందరూ తేలిపోయారు. అయినప్పటికీ ఓవరాల్‌గా తలా కొంత స్కోర్ చేయడం జట్టుకు ప్లస్ అయ్యింది. ఇక చివరలో రాహుల్ తెవాటియా (31) విజృంభించడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ను ఓడించారు.
Rahul Tewatia the man again who is at the finishing line guiding them home 😎
Gujarat Titans have come up on 🔝 in Mullanpur with a clinical performance and have settled their scores with #PBKS 🙌
Scorecard ▶️ https://t.co/avVO2pCwJO#TATAIPL | #PBKSvGT | @gujarat_titans pic.twitter.com/h8BiuB7UVT
— IndianPremierLeague (@IPL) April 21, 2024
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ పవర్ ప్లే పూర్తయ్యేలోపే తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి పంజాబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఏడో ఓవర్‌లో చివరి బంతికి రొస్సోవ్ (9).. ఎనిమిదో ఓవర్‌లో ఐదో బంతికి కరన్ (20) ఔటయ్యారు. ఈ రెండు వికెట్ల విషయంలో పంజాబ్ రివ్యూకు వెళ్లినప్పటికీ పంజాబ్‌కు వ్యతిరేకంగానే ఫలితం వచ్చింది. వరుసగా రెండు వికెట్లను కోల్పోవడంతో పంజాబ్ పరుగుల వేటలో నెమ్మదించింది. గుజరాత్ బౌలర్లను తట్టుకోలేక నిలకడగా ఆడుతూ వచ్చింది. దీంతో పవర్‌ప్లే పూర్తయ్యే సరికి 56 పరుగులు చేసిన పంజాబ్.. 10 ఓవర్లకు 74 పరుగులు మాత్రమే చేసింది.
ఇక 11వ ఓవర్ నుంచి పంజాబ్ మళ్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్‌లో రెండో బంతికి లివింగ్‌స్టన్ (6) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో నాలుగో బంతికి జితేశ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14వ ఓవర్‌లో ఆశుతోష్ (3) కూడా ఔటయ్యాడు. తొలి బంతికి రివ్యూ వెళ్లడంతో సానుకూల ఫలితం వచ్చింది. కానీ ఐదో బంతికి భారీ సిక్స్ కొట్టేందుకు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. 16వ ఓవర్‌లో రెండో బంతికి శశాంక్ సింగ్ (8) కూడా ఔటయ్యాడు. 19వ ఓవర్‌లో చివరి బంతికి భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన బ్రార్ (29) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్ (0), భాటియా (14) వికెట్‌ను పంజాబ్ కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 142 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.