New Delhi, OCT 14: ఐసీసీ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై (IND Vs PAK) టీమిండియా విక్టరీతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. కీలకమైన మ్యాచ్ లో రాణించిన టీమిండియా (Team India) ఆటగాళ్లను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. క్రికెట్ లవర్స్ తో పాటూ సినీ, రాజకీయ ప్రముఖులు టీమిండియాను పొగుడుతూ పోస్టులు చేస్తున్నారు. అయితే పాక్ పై భారత్ విజయంతో ప్రధాని మోదీ ఎక్స్ లో (Modi Tweet) పోస్టు చేశారరు. అహ్మదాబాద్ లో టీమిండియా గ్రేట్ విన్ అంటూ కొనియాడారు. ఆల్ రౌండ్ ప్రతిభతో అద్భుత విజయం సాధించారని, రాబోయే మ్యాచ్ ల కోసం టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రధాని మోదీ.
Team India all the way!
A great win today in Ahmedabad, powered by all round excellence.
Congratulations to the team and best wishes for the matches ahead.
— Narendra Modi (@narendramodi) October 14, 2023
అటు ప్రపంచ కప్ -2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి 156 పరుగులు జోడించారు.. తర్వాత బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. 19.3 ఓవర్లు (117 బంతులు) మిగిలి ఉండగానే భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సరిగ్గా విన్నింగ్ షాట్‌తోనే శ్రేయాస్ అయ్యర్ (53) తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం ఆసక్తికర పరిణామం.