Motera Cricket Stadium (Photo Credits: Twitter/ BCCI)

గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్ లో నిర్మించిన సర్దార్ పటేల్ (మొతేరా) స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుధవారం వర్చువల్ ద్వారా (Motera Stadium Inauguration) ప్రారంభించారు. మోటెరా స్టేడియంను నరేంద్ర మోడీ స్టేడియం గా (Motera stadium, renames it Narendra Modi stadium) మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. లక్షా పది వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా మొతేరా రూపు దిద్దుకుంది.

ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మధ్య నేడు ప్రారంభం అయింది. అసలే భారీ స్టేడియం పైగా డే అండ్ నైట్ మ్యాచ్ గులాబి బంతితో మ్యాచ్ జరగనుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రూ.800 కోట్ల వ్యయంతో ఈ స్టేడియం నిర్మితమైంది. ప్ల‌డ్ లైట్ల‌కు బ‌దులుగా ఎల్ఈడీ లైట్ల‌ను వినియోగించారు.

మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్‌ ప్రాక్టీస్‌ నెట్స్‌ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్‌లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్‌, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం పడితే మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత భారీ వర్షం కురిసినా.. 30 నిమిషాల్లో గ్రౌండ్‌ ఆటకు సిద్ధంగా మారిపోతుంది.

Here's ANI Update

ఇక స్టేడియంలో ఉన్న 55 రూమ్‌ క్లబ్‌హౌస్‌లలో 3D మినీ థియేటర్లు ఉన్నాయి. ఒలింపిక్‌ సైజులో స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు ఉన్నాయి. ఇక ఈ స్టేడియంలో 3 వేల కార్లు, 10 బైక్‌లను పార్క్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చొని మ్యాచ్‌ చూడొచ్చు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో 90 వేల నుంచి లక్షా మంది సీటింగ్‌ కెపాసిటీ ఉంది. అందుకే వరల్డ్‌లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది..! అందుకే ఈ పింక్‌ బాల్‌ టెస్ట్‌పై క్రేజు పెరిగింది.

Here's bhumi pujan Update

మోటెరా స్టేడియం 63 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు మొత్తం 76 కార్పొరేట్ పెట్టెలు, ఒలింపిక్ స్థాయి స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అకాడమీ, అథ్లెట్లకు నాలుగు డ్రెస్సింగ్ రూములు మరియు ఫుడ్ కోర్టులు ఉన్నాయి."క్రికెట్ కోసం మాత్రమే కాదు, ఇది భారతదేశానికి గర్వకారణం. అతిపెద్ద క్రికెట్ స్టేడియం కాకుండా, ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక స్టేడియంలలో ఒకటి. అహ్మదాబాద్ దేశంలోని 'స్పోర్ట్స్ సిటీ'గా మారుతోందని మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మోటెరా స్టేడియం యొక్క సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసించారు.

ఐపీఎల్ 14లో తలపడే ఎనిమిది జట్ల ప్లేయర్ల పూర్తి లిస్టు ఇదే, మొత్తం 57 మంది ఆటగాళ్లు వేలం, అందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు, మొత్తం లిస్టుపై ఓ లుక్కేసుకోండి

గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్న బీసీసీఐ, ఇరు జట్ల క్రికెటర్లు స్టేడియంపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం అధిగమించింది.

మొతేరా స్టేడియానికి సంబంధించి మరిన్ని విశేషాలు

* పేరు: సర్దార్ పటేల్ స్టేడియం/మొతేరా స్టేడియం

* మైదానం పరిమాణం: 180 X 150 గజాలు

* వేదిక పరిమాణం: 63 ఎకరాలు, నాలుగు ప్రవేశ ద్వారాలు

* సౌకర్యాలు: నాలుగు టీం డ్రెస్సింగు రూములు, ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, మూడు అవుట్‌డోర్ ప్రాక్టీస్ ఫీల్డ్స్

* స్టేడియం సామర్థ్యం: ఒకేసారి 1,10,000 అభిమానులు కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టేడియం

పునరుద్ధరణ కోసం స్టేడియంను మూసివేయడానికి ముందు ఇక్కడ 12 టెస్టులు, 23 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరిగింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 1984-85లో జరిగిన మ్యాచ్‌తో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక అయింది. 2006లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఈ వేదిక కూడా ఉంది. ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా ఆతిథ్యమిచ్చింది. ఇప్పటి వరకు ఇది 12 టెస్టులకు ఆతిథ్యమిచ్చింది. 2009లో ఇక్కడ శ్రీలంక ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 760 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది అత్యల్పం.