Rishabh Pant and Shubman Gill (Image: Indian Premier League)

New Delhi, April 24: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం (Delhi Capitals Won) సాధించింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ (DC Vs GT) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88*), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడారు. గుజరాత్‌ బౌలర్లలో వారియర్‌ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఆ జట్టులో సాయి సుదర్శన్‌ (65), మిల్లర్‌ (55) అర్ధశతకాలతో చెలరేగారు. సాహా(39) రాణించాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) (21*) పోరాడినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఢిల్లీ బౌలర్లలో రషిఖ్‌ 3, కుల్దీప్‌ 2, నోకియా 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు.

 

అంత‌కుముందు ఢిల్లీ బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడారు. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ (Rishab Panth), అక్షర్‌ పటేల్‌ (Akshar Patel) చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జేక్‌ ఫ్రేజర్‌, పృథ్వీషా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్‌కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్‌ ప్లే ముగిసేలోపు షై హోప్‌ (5) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. రిషబ్‌ పంత్‌ (88), అక్షర్‌ పటేల్‌ (66) జోరుగా ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగారు. అయితే 17వ ఓవర్‌లో సాయికిశోర్‌కు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్ట్రబ్స్‌ (26) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసరికి నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. గుజరాత్‌ ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.