వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా..వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఇంతకు ముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. 1996 వరల్డ్‌కప్‌లో కుంబ్లే, 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ 15 వికెట్లు పడగొట్టాడు.
తాజాగా జడ్డూ వీరిద్దరి రికార్డును అధిగమించి, వరల్డ్‌కప్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా అవతరించాడు. ఈ విభాగంలో కుల్దీప్ (14 వికెట్లు).. జడేజా, కుంబ్లే, యువరాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. కాగా, వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు.