Bengaluru, March 13: బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ (Pink Ball Test) మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) 303/9 దగ్గర డిక్లేర్ చేసింది. శ్రీలంక (Srilanka) ముందు 447 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఇవాళ ఆట ఆరంభంలోనే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే పరిమితం చేసిన రోహిత్ సేన… ఆపై రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ఆరంభించింది. రిషబ్ పంత్ (Rishab Pant) దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో భారత్ (India)తరఫున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు పంత్. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (Kapil dev)పేరిట ఉండేది. పంత్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.
FIFTY!@RishabhPant17 surpasses Kapil Dev to score the fastest 50 by an Indian in Test cricket. It has come off 28 deliveries.
Take a bow, Rishabh 👏💪💥
Live - https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/YcpJf2sp2H
— BCCI (@BCCI) March 13, 2022
శ్రేయర్ అయ్యర్ (shreyas ayar)కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయ్యర్ 87 బంతుల్లో 67 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా, భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన లంకకు మొదటి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. తిరుమనె (0) డకౌటయ్యాడు. 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 303/9 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. దీంతో లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో శ్రేయస్ అయ్యర్ ( 87 బంతుల్లో 67 పరుగులు..9 ఫోర్లు), రిషబ్ పంత్ (31 బంతుల్లో 50 పరుగులు.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. పంత్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత్ తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (46 పరుగులు.. 79 బంతుల్లో.. 4 ఫోర్లు) రాణించాడు. మిగతా బ్యాటర్లలో హనుమ విహారి 35, మయాంక్ అగర్వాల్ 22, విరాట్ కోహ్లీ 13, రవీంద్ర జడేజా 22, అశ్విన్ 13, అక్షర్ పటేల్ 9, మహ్మద్ షమి 16* పరుగులు చేశారు. లంక బౌలర్లలో జయవిక్రమ 4 వికెట్లు పడగొట్టాడు. ఎంబుల్దేనియా మూడు వికెట్లు తీశాడు. ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో తలో వికెట్ తీశారు.
భారత్ ఇప్పటివరకు మూడే పింక్ బాల్ టెస్ట్ (Pink ball test) మ్యాచులు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2015 నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు తొలి పింక్ బాల్ టెస్ట్ (డే/నైట్) జరిగింది. అందులో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 18 టెస్టులు జరిగాయి. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్టు అంతర్జాతీయంగా 19వ మ్యాచ్. రికార్డుపరంగా చూసుకుంటే… ఆస్ట్రేలియానే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచింది. పది టెస్టులకుగాను పదింటిలోనూ విజయం సాధించడం విశేషం. టీమిండియాకు మాత్రం ఇది నాలుగో డే/నైట్ టెస్టు. మిగతా మూడు మ్యాచుల్లో భారత్ రెండు విజయాలు, ఒక ఘోర ఓటమి చవిచూసింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పింక్ బాల్ టెస్టులోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది.