New Delhi, OT 14: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్లు కొట్టిన మొదటి భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 86 పరుగులు చేసి టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాలుగో సిక్సర్ కొట్టిన తరువాత వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన (300 Sixes In Odi History) తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ (Rohit Sharma) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉన్నాడు. అఫ్రీది 351 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత క్రిస్‌గేల్ 331 సిక్సర్లతో రెండ స్థానంలో ఉన్నాడు.
🚨 Milestone Alert 🚨
3⃣0⃣0⃣ ODI Sixes & Going Strong 💪 💪
Rohit Sharma 🤝 Another Landmark
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/fjrq0AQFyF
— BCCI (@BCCI) October 14, 2023
వన్డే క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితా..
షాహిద్ అఫ్రిది – 351 సిక్సర్లు
క్రిస్ గేల్ – 331 సిక్సర్లు
రోహిత్ శర్మ – 302* సిక్సర్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజాం (50) హాఫ్ సెంచరీ చేయగా, మహ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36) లు రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రవీంద్ర జడేజా లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకం చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ ఓ వికెట్ పడగొట్టాడు.