Newdelhi, Dec 22: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్ లో సూపర్ ఫామ్ మీదున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గాయపడగా.. తాజాగా కెప్పెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా గాయపడ్డాడు. మెల్‌బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తుండగా హిట్ మ్యాన్ కి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో రోహిత్ ఎడమ మోకాలికి బాల్ బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడినట్లు పలు రిపోర్టులు పెర్కొన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
🚨 Rohit Sharma was hit on his left knee during practice and was subsequently spotted icing it ahead of the #BoxingDayTest in Melbourne 👀#BorderGavaskarTrophy #BGT2024 #AUSvIND pic.twitter.com/uU6CqSDdzt
— Cricbuzz (@cricbuzz) December 22, 2024
పోటాపోటీ
ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది.