New Delhi, Feb 19: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా (Test captain) రోహిత్ శర్మ (Rohit Sharma) ఫిక్సయ్యాడు. ఇప్పటివరకు వన్డే, టీ-20 కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ ను శ్రీలంక సిరీస్ కోసం (Sri Lanka series) టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul), వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌లలో (Rishabh Pant) ఒకరిని సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ సెలక్టర్లు రోహిత్ వైపే మొగ్గుచూపారు. దీంతో అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రకటించాడు. దీంతో టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు ప్రమోషన్ వచ్చింది.
🚨 JUST IN: India have named their new permanent Test captain.
Details 👇https://t.co/lgLdDROGyE
— ICC (@ICC) February 19, 2022
మార్చి 4 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ టెస్టుల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా మొదటి పరీక్ష. ఈ సిరీస్ కోసం బీసీసీఐ టీమ్‌ఇండియా జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) వైస్ కెప్టెన్‌గా నియమించారు. అజింక్యా రహానె, ఛటేశ్వర్ పూజారాలను జట్టు నుంచి తప్పించారు. మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు మొదటి టెస్టు, బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు (డే/నైట్) రెండో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకతో భారత్ మూడు టీ20లను ఆడనుంది. ఫిబ్రవరి 24న (లక్నో), 26న (ధర్మశాల), 27న (ధర్మశాల) మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో లంకతో సిరీస్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది.
టెస్టు టీమ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహరి, శుభమన్ గిల్, రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), కేఎస్ భరత్, అశ్విన్ (ఫిట్‌నెస్‌గా ఉంటే), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా (వైస్ కెప్టెన్), షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.
టీ20 టీమ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్‌ఖాన్