సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్ పేసర్ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు కగిసో రబడ అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రోహిత్.. నండ్రీ బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో రబడ మరోసారి మాయ చేసి అద్భుత బంతితో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న భారత జట్టు సారథి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో టెస్టుల్లో రోహిత్ గణాంకాల(14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 , 0)ను ప్రస్తావిస్తూ #Duck అభిమానులు సైతం పేరిట ట్రోల్ చేస్తున్నారు. ‘‘రోహిత్ ఇక టెస్టుల నుంచి కూడా రిటైర్ అయిపో’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.
Here's Video
what A bowler! https://t.co/DlCUi3rVDI pic.twitter.com/rCF8hUA3zf
— rishi w (@nerve_of_steel) December 28, 2023
Rohit Sharma in South Africa Tests :
14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 , 0
Average : 12.8
Choking of highest quality. pic.twitter.com/FzGMgViyl1
— 𝐊𝐨𝐡𝐥𝐢𝐧𝐚𝐭!𝟎𝐧_👑🚩 (@bholination) December 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)