Barsapara-Stadium (PIC@ IPL X)

Guwahati, May 19: ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఆఖ‌రి లీగ్ మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం అయింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR), కోల్‌క‌తా నైట్ రైడర్స్(KKR) పోరు ఒక్క బంతి ప‌డ‌కుండానే ర‌ద్ద‌యింది. 10:30 గంట‌ల‌కు టాస్ వేశాక‌ మ‌ళ్లీ వాన ప‌డ‌డంతో (Rain) అంపైర్లు ఇరుజ‌ట్ల‌కు చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో, క్వాలిఫ‌య‌ర్ ఆడాల‌నుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఈ ప‌రిణామంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మే 21న కోల్‌క‌తాతో క్వాలిఫ‌య‌ర్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టు (RR) మే 22న జ‌రిగే ఎలిమినేట‌ర్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును (RCB) ఢీకొట్ట‌నుంది.

 

ప్లే ఆఫ్స్ ముందు గెలుపు బాట ప‌ట్టాల‌నుకున్న రాజ‌స్థాన్ క‌ల నెర‌వేర‌లేదు. గువాహ‌టిలో వాన కార‌ణంగా కోల్‌క‌తాతో జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్ద‌యింది. దాంతో, 17 పాయింట్లు వ‌చ్చినా కూడా నెట్‌ర‌న్ రేటులో ముందున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క్వాలిఫ‌య‌ర్‌కు అర్హ‌త సాధిచింది. ఉప్ప‌ల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెల‌వ‌డం క‌మిన్స్ సేన‌కు క‌లిసొచ్చింది. మ‌రోవైపు చిన్న‌స్వామి స్టేడియంలో అద్భుతం చేసిన ఆర్సీబీ తొమ్మిదోసారి ప్లే ఆఫ్స్ బ‌రిలో నిలిచింది. తొలుత 218 ర‌న్స్ కొట్టిన బెంగ‌ళూరు ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించింది. య‌శ్ ద‌యాల్ ఆఖ‌రి ఓవ‌ర్లో 7 ర‌న్స్ మాత్ర‌మే ఇవ్వ‌డంతో 27 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ విజ‌య ఢంకా మోగించింది.