Shivam Dube (Photo Credits: BCCI/X))

New Delhi, OCT 05: గ్వాలియర్ వేదికగా ఆదివారం​ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు (IND vs BAN T20I series) టీమిండియా (Team India) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ (BCCI) ధ్రువీక‌రించింది. వెన్ను గాయం కార‌ణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్ధానాన్ని తిల‌క్ వ‌ర్మ‌తో (Tilak Varma) సెలక్షన్ కమిటీ భ‌ర్తీ చేసింది.

IND vs BAN 2nd Test 2024:బంగ్లాపై రెండో టెస్టులో విక్ట‌రీతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ప‌వ‌ర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ 

ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జ‌ట్టుతో (Tilak varma) చేర‌నున్నాడ‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. తిల‌క్ వ‌ర్మ భార‌త్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు.

Here's the Tweet

 

కాగా ఐపీఎల్-2024 త‌ర్వాత ఈ హైద‌రాబాదీ గాయ ప‌డ్డాడు. దీంతో అత‌డిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20ల‌కు సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో మ‌రోసారి అత‌డికి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది.

భార‌త టీ20 జ‌ట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ