IND vs BAN 2nd Test 2024: Yashasvi Jaiswal’s Fifty Guides India to Victory, Men in Blue Win Series Against Bangladesh 2–0

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు(Ind Vs Ban)లో సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో 95 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్న‌ది. దీంతో భార‌త్ 7 వికెట్ల తేడాతో విజ‌యం న‌మోదు చేసింది. ఓపెన‌ర్ జైస్వాల్ త‌న ప‌వ‌ర్ హిట్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. కోహ్లీ 29 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా..

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 ర‌న్స్‌కు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, అశ్విన్‌, జ‌డేజాలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. జ‌డేజా మూడు ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు తీసి.. భార‌త గెలుపున‌కు బాట‌లు వేశాడు.అయిదో రోజు 26 ప‌రుగుల వ‌ద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. కేవ‌లం 146 ర‌న్స్‌కే ఆలౌటైంది. దీంతో ఇండియాకు స్వ‌ల్ప టార్గెట్ ద‌క్కింది.