Mumbai, JAN 05: భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత (Smriti Mandhana Record) సాధించింది. మహిళల టీ20ల్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 (T20) మ్యాచులో రెండు పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఆమె దీన్ని సాధించింది. ఈ క్రమంలో ఈ ఘనత అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్‌గా ఆరో బ్యాటర్‌గా మంధాన నిలిచింది. మంధాన (Smriti Mandhana) కంటే ముందు టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harman Preeth) తన కెరీర్‌లో 158 మ్యాచుల్లో 3195 పరుగులు చేసింది.
🚨 Milestone 🚨
3⃣0⃣0⃣0⃣ T20I runs & counting! 🙌 🙌
Congratulations, Smriti Mandhana 👏 👏
Follow the Match ▶️ https://t.co/rNWyVNHrmk #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/9m2VOSZYBW
— BCCI Women (@BCCIWomen) January 5, 2024
ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా న్యూజిలాండ్ చెందిన బేట్స్ (4,118) నిలిచింది. ఆ తరువాత మెగ్‌లానింగ్ (3,405), టేలర్ (3,226)లు ఉన్నారు. ఇక మంధాన ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో కలిపి 126 టీ20 మ్యాచుల్లో మంధాన 3052 పరుగులు చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఫొబే లిచ్‌ఫీల్డ్(49; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అలీసా పెర్రీ(37; 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు నాలుగు వికెట్లు తీసింది. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్ ఓ వికెట్ సాధించింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ 17.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. మంధానతో పాటు షఫాలీ వర్మ (64నాటౌట్) అర్ధశతకంతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్‌హామ్ ఓ వికెట్ తీసింది.